మేలైన పానీయాలు 

శరీరంలో మలినాలు పోవాలంటే రోగ నిరోధక శక్తి పెరగాలంటే పోషకాలు లభించే మంచి పానీయాలు తీసుకోవాలీ బత్తాయి అల్లం దాల్చిన చెక్క కలిపిన పానీయం శరీరానికి మెరుపునిస్తుంది.బత్తాయిని సన్నటి చక్రాల్లా తరిగి చల్లని నీళ్లలో వేయాలి. దానిలో అల్లం ముక్క ఐదారు పుదీనా ఆకులు దాల్చిన చెక్క వేసి నాననివ్వాలి.బత్తాయి నుంచి సి  విటమిన్, జింక్, క్యాల్షియం ఖనిజాలు దాల్చిన చెక్క లోని పోషకాలు శరీరంలోని రక్త సరఫరాని మెరుగుపరుస్తాయి.అలాగే చల్లని నీళ్లలో కీర దోస ముక్కలు వేసి పుదీనా ఆకులు, సన్నగా తరిగిన నిమ్మకాయ స్లైసులు వేసి రెండు మూడు గంటలు నాననిస్తే ఈ పానీయం శరీరం చల్లబరుస్తుంది.