చక్కని పరిమళం ఇది

శిరోజాలు సువాసన తో తాజాగా ఉండాలంటే ఇంట్లో చేసిన స్ప్రే బాగా ఉపయోగపడుతోంది సగం కప్పు రోజ్ వాటర్ కొన్ని చుక్కల వెనీలా ఎక్పాల్ట్ జాస్మిన్ నూనె పది చుక్కలు, కొన్ని చుక్కల స్వీట్ ఆరెంజ్ నూనె తీసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి స్ప్రే బాటిల్ లో పోస్తే  ఇక హెయిర్ పర్ఫ్యూమ్ రెడీ అయినట్లే.ఈ పర్ ఫ్యూమ్ తలస్నానం చేశాక వెంట్రుకల పై స్ప్రే చేసుకోవాలి.జుట్టు మెరుపును పోయినట్లు అనిపిస్తే ఈ హెయిర్ పర్ఫ్యూమ్ ఉపయోగించి చూడండి.ప్రతిరోజు తలపై స్ప్రే చేయవచ్చు.