కరోనా కట్టడి విషయంలో ఫిన్ లాండ్ ప్రధాని సన్నా మారిన్ తీసుకొన్న చర్యలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. మర్చి 16 నాటికి మూడు వందల కేసులు నమోదయ్యాయి. వెంటనే దేశంలో ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించారు సన్నా మారిన్ దేశాదీ నేతగా కాకుండా తల్లి మనసుతో వ్యవహరించింది ఫిన్ లాండ్ ప్రధాని సన్నా మారిన్. ఇతర దేశాలతో రాకపోకలు నిషేదించారు. లాక్ డౌన్ కఠినంగా అమలైంది. పిల్లల భవిష్యత్ కోసం వర్చువల్ క్లాసులు కొనసాగించారు. వయస్సు మళ్ళిన వారి ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. వైద్య వ్యవస్థను బలోపేతం చేశారు. ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే దేశాలలో మొదటి స్థానంలో ఉండే ఫిన్ లాండ్ పూర్వ స్థితిని తెచ్చేందుకు సన్నా మారిన్ ఎంతో కృషిచేస్తున్నారు.

Leave a comment