వేసవి ఎండలు ముదురుతున్న కొద్దీ మొహం,మెడ నల్లబడుతూ ఉంటాయి.సన్ స్క్రీన్ లు రాసుకోన్న చర్మం నల్లబడుతూనే ఉంటుంది. క్రమం తప్పకుండా కొన్ని పేస్ ప్యాక్స్ వేసుకొంటు వుంటే సన్ ట్యాన్ పోతుంది. కొంచెం పాలల్లో నాలుగు చుక్కలు నిమ్మరసం చిటికెడు కుంకుమ పువ్వు వేసి కలిపి ఆ ప్యాక్ మొహం పైన వేసి ఆరాక కడిగేస్తే సరి. తర్వాత మొయిశ్చ రైజర్ రాయాలి. అలాగే పాలల్లో గుజ్జు చేసిన టమోటా పసుపు ,నిమ్మరసం తేనె కలిపి ప్యాక్ వేసుకోవచ్చు అలాగే సెనగపిండి,పసుపు,నారింజ తొక్కల పొడి రోజ్ వాటర్ కలిపిన పేస్ ప్యాక్ వారంలో నాలుగైదుసార్లు వేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ల్లో ఎలాటి రసాయనాలు లేవు కనుక ఏ సైడ్ ఎఫెక్ట్ లు రావు.

Leave a comment