“శృంఖలాదేవి ప్రసాదం”

కలకత్తాలోని హుగ్లీ లో వున్న శక్తిపీఠమే ప్రద్యుమ్న శృంఖలాదేవి.త్రేతాయుగంలో రోమపాదుడనే చక్రవర్తి ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేశాడని,అమ్మవారి ఉదర భాగం ఇక్కడ పడింది అని అంటారు.

ఒకసారి రోమపాదుడి రాజ్యంలో కరువు తాండవం చేస్తోంది.జనం తిండి లేక విలవిల్లాడారు.రుష్యశృంగుడనే మహర్షి ఈ ప్రదేశానికి వస్తే అంతా సస్యశ్యామలంగా వుంటుంది అని చెప్పారు.వెంటనే చక్రవర్తి తన సైన్యాన్ని,కొంత మంది యువతులను రుష్యశృంగుని ఆశ్రమం వద్దకు పంపించాడు.అతను ఆ యువతుల అందచందాలను చూసి ముగ్ధుడై వారి వెంటే నడుచుకుంటూ రోమపాదుడి రాజ్యంలో కాలు పెట్టగానే వర్షం కురిసింది.అది చూచి రాజు తన కుమార్తె ఇచ్చి వివాహం చేశాడు.రుష్యశృంగుని కోసమే శృంఖలాదేవి ఆలయం నిర్మించారు.

నిత్యప్రసాదం:కొబ్బరి,పాయసం

            -తోలేటి వెంకట శిరీష