బాల…గోపాల కృష్ణ పాహి పాహి!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  కృష్ణజిల్లా దివిసీమకు సమీపంలో ఉన్న మొవ్వ గ్రామంలో  శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దర్శించి వద్దాం పదండి.గర్భాలయంలో శ్రీ వేణుగోపాల స్వామి,గర్భాలయ వెలుపల శ్రీ రాజ్యలక్ష్మిదేవి, గోదాదేవి కొలువై ఉన్నారు.ఈ ఆలయం ఎంతో భక్తి ప్రపత్తులతో భక్తులు కొలుస్తారు.
ఈ అరణ్య ప్రాంతంలో మౌద్గల్య మహాముని తపస్సు ఆచరిస్తున్న అక్కడ ఇసుకతో చిన్న వేణుగోపాల స్వామిని తయారు చేసుకుని పూజలు చేసేవారు.సమీపంలో ఒక బ్రాహ్మణ పల్లె ఉంది.వరదయ్య అనే బాలుడిని మౌద్గల్య ముని చేరదీసి అతని తేజస్సు గమనించిన మంచి ప్రవర్తన గురించి వివరంగా బోధించారు. కొన్ని పదాలను అభ్యాసం చేసి వరదయ్య పలు క్షేత్రాలకు వెళ్లి ప్రదర్శించి మెప్పు పొందారు.ఆ పదాలే క్షేత్రయ్య పదాలుగా ప్రసిద్ధి చెందాయి.
ఈ క్షేత్రంను తప్పకుండా దర్శనం చేసుకోని ఆ మువ్వగోపాలుని ఆశీస్సులు అందుకోవడం విశేషం.

నిత్య ప్రసాదం: కొబ్బరి,అటుకులు

   -తోలేటి వెంకట శిరీష

Leave a comment