కేరళలో కొబ్బరి నూనె తో వంటలు వండుకుంటారు. ఈ కొబ్బరి నూనె వాడకం వల్లనే కేరళ ఆడవాళ్ళకు చక్కని జుట్టు వుంటుంది. సౌందర్య పరంగా కుడా ఈ కొబ్బరి నూనె ఎంతో ఉపయోగం. కొవ్వు తో పాటు యాంటీ బాక్టీరియల్ గుణాలు కొబ్బరి నూనె లో ఉంటాయి. ఈ నూనె మొహానికి రాసుకుంటే చర్మం శుబ్రంగా తేమగా వుంటుంది. మేకప్ తొలగించుకునేందుకు  కుడా కొబ్బరి నూనె శ్రేష్టం అలంకరణ పూర్తిగా పోతుంద, మొహం తాజాగా వుంటుంది. జుట్టు పొడిబారి ఎందుగాడ్డిలా వుంటే గోరువెచ్చని కొబ్బరి నూనె మర్దనా చయచ్చు. ఇందులో వుండే విటమిన్ ఇ జుట్టుకు మంచి పోషణ ఇస్తుంది. నిద్రలేక , కళ్ళు ఉబ్బి, నల్లని వలయాలు కనిపిస్తే కొబ్బరి ననునే కళ్ళ చుట్టూ ,మర్దనా చేస్తే  నలుపు చాలా త్వరగా తగ్గిపోతుంది.

Leave a comment