లవంగం రసంతో ఉపశమనం

కరోనా లక్షణాలలో ఒకటి గొంతు నొప్పి రావటం, బొంగురు పోయినట్లు ఉండటం పట్టేసినట్లు ఉండటం ముఖ్యమైనవి  లవంగ రసం తో గొంతు ఇబ్బందులు తగ్గుతాయి. మంచి ఉపశమనం లభిస్తుంది లవంగం మంచి స్ట్రెస్ బస్టర్ ఒత్తిడి రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.అందుకే లవంగాల తో పాటు కొన్ని తులసి పుదీనా ఆకులు కొన్ని యాలుకలు లవంగాలు మొగ్గలు నీళ్లలో వేసి మరిగించి టీ తాగితే ఒత్తిడి తగ్గిపోతుంది. టీ లో లవంగాలు పొడి చేసి వేసి తాగితే జీర్ణ వ్యవస్థ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈ లవంగాలు వేసిన కషాయం కూడా సాధారణ ఆరోగ్యానికీ,  రోగ నిరోధక శక్తి పెంపుకు ఉపయోగపడతాయి.