రాణి అన్న యువతి పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి సంగీత్ లో అందరూ ఉత్సాహంగా నృత్యం చేస్తుంటారు. వరుడు ఈ పెళ్లి చేసుకోనని నిరాకరిస్తాడు.మనసు మార్చుకొన్ననంటాడు.ఆ సమయంలో రాణి నిర్ణయం తీసుకుంటుంది తను ఒక్కతే హనీమూన్ కోసం బుక్ చేసిన టికెట్ తో ప్యారిస్ వెళ్తా నంటుంది.తండ్రి వప్పు కుంటాడు.అలా ప్యారిస్ చేరిన రాణి ప్రతిచోట కొత్త స్నేహితులను కలుసుకుంటుంది.జీవితం తన చేజారి పోలేదని తెలుసుకుంటుంది.ఆడపిల్ల జీవితంలో ఒక్క కుదుపు వస్తే ఆమె జీవితం అంతటితో ముగిసిపోయిందనే భ్రమ లోంచి బయటకు రావాలని ఎప్పుడు ప్రతి మనిషికీ జీవితం కొత్త అవకాశాలు ఇస్తూనే ఉంటుందని చెబుతోంది. సినిమా ఎన్నో అవార్డు లు గెలుచుకున్న ఈ చిత్రం వాణిజ్య పరంగా ను పెద్ద సక్సెస్ సాధించింది.

Leave a comment