Categories
Gagana

ప్రపంచ రెజ్లింగ్ పోటీలకు కవితాదేవి.

అమెరికాలో మహిళల కోసం ప్రేఅత్యేకంగా నిర్వహించే మేయి యంగ్ పోటీలో పాల్గొనే తోలి భారతీయురాలిగా రికార్డు సృష్టించిన కవితా దేవి. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ WWE కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నాయి. కవిత ది హరియానా. ఎస్. ఎస్.బి కానిస్టేబుల్. ఈమె గత సౌత్ ఏషియన్ గేమ్స్ లో, వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ గా బంగారు పతాకం సాధించింది. WWE మాజీ చాంపియన్ దిగ్రేట్ ఖలీ దగ్గర మల్ల యుర్ధ శిక్షణ తీసుకొంది కవితా దేవి. ఆయన నిర్వహించిన కాంటినెంటల్ రెజ్లింగ్ లో బేబీ బుల్ అనే మహిళతో తలబడి ఆమెను ఓడించిన తీరుసోషల్ మీడియాలో ఎందఱో అభిమానులను ఆమెకు సంపాదించి పెట్టింది.  దానితో WWE దుబాయిలో నిర్వహించిన ప్రాధమిక పోటీల్లో ఈమెకు పాల్గొనే అవకాశం వచ్చింది. అందులో కవితా దేవి యోదురాలిగా తన శక్తి నిరుపించుకోవడం తో ప్రపంచ పోటీలకు ఆమెకు అవకాశం లభించింది.

Leave a comment