జాక్ లండన్ అనువాదం:కొడవటిగంటి కుటుంబరావు
జాక్ లండన్ ,దికాల్ ఆఫ్ ది వైల్డ్ కు తెలుగు అనువాదం ప్రకృతి పిలుపు. ఇది బక్ అన్న ఒక జాతి కుక్కకథ. ఒక భూస్వామి ఇంట్లో ఉన్నా బక్ అన్న కుక్క బంగారం తవ్వకం కోసం మంచు ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళ చేతులో పడి ఎన్నో ఇబ్బందులకు గురవుతుంది. సుఖంగా ఉన్న ఇంటి వాతావరణంలోంచి ఎన్నో చేతులు మారుతూ ఎన్నో అనుభవాలు పొందుతూ బక్ మనుషులకుండే జిత్తులన్ని నేర్చుకొంటుంది. బక్ ఎంతో శక్తి శాలి. కష్టంతో కూడుకున్న ఈ ప్రయాణంలో ఒక్ నెమ్మదిగా దాని మనసు లోతులను తెలుసుకొంటుంది. దాని రక్తంలో పురాతనమైన ఆటవిక కాలం నాటి జాగాలున్నాయి. దానికి సంబంధించిన ఒక గుంపు దూర తీరాల నుంచి ఏలుతున్నట్లు బక్ శరీరం మొత్తంగా వింటూ వస్తుంది. ఒక స్వేచ్చ కోసం తన వాళ్ళదే అయినా స్పర్శ కోసం తపించి పోతుంది. ఎక్కడో పట్టణం నుంచి బయలుదేరి ఒక అడవిలోకి చేరిన బక్ కథను జాక్ లండన్ ఎంతో చక్కగా తెలుగులోకి అనువాదం చేశారు.ప్రసిద్దరచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావుగారు జన్మంతర బంధాల్ని ఒక వారసత్వపు అనుబంధాన్ని వివేకవంతమైన మనుషులు గుర్తించగలిగే ధర్మాన్ని కుక్కలో ఊహించగలిగాడు జాక్ లండన్. ఈ అద్భుతమైన నవల తప్పకుండా చదవండి…వివరాలకు ఫోన్ నెం: 9866115655

Leave a comment