Categories
WoW

నగలన్నీ పొందిగ్గా అమర్చాలంటే

ఈ తరం అమ్మాయిల డ్రెస్సింగ్ టేబుల్లో బోలెడన్ని ఆభరణాలు ఉంటున్నాయి. చెవి పోగుల దగ్గర నుంచి చేతికి పెట్టుకునే బ్రాస్ లెట్లు, మెడలో గొలుసులు, తల్లో క్లిప్పులు ప్రతిదీ రోజు మార్చే డ్రెస్ తో పాటే మారిపోతున్నాయి. అందుకు తగ్గట్టే మెటల్, వన్ గ్రామ్ గోల్డ్, పూసలు, రాళ్ళు కలిపి మ్యాచింగ్ కు పనికి వచ్చేలా చేసిన ఆభరణాలు ఎన్నో వస్తున్నాయి. ఎప్పటి కప్పుడు ఈ ఆభరణాల్లోను కొత్త డిజైన్లు వస్తున్నాయి. మరి దుస్తుల్ని ఒక్కో క్షణంలో తీసుకోవచ్చు. మరి ఆభరణాలను అలా వేరు చేసి తీసుకోవడం ఎలా? ఆభరణాలను అవసరమైనప్పుడు క్షణంలో తీసుకునేలాగా విడివిడిగా అమర్చుకునేందుకు వచ్చాయి జ్యువెలరీ స్టాండ్స్. చెట్టులా, అచ్చం చేయిలా, సీతాకోక చిలుకలా ఎన్నో రూపాల్లో అలంకరణ వస్తువుగా ఎంతో అందంగా వున్నాయి. ప్రత్యేకించి చెవి పోగులు పెట్టుకునేందుకు అయితే ఎన్నో స్టాండ్స్. నెక్లెసులు, చైన్లు విషయనికైతే వీటిని ఒక చోట పెట్టామంటే చిక్కులు పడిపోతాయి. వీటి కోసం పెంటెంట్ చైన్ డిస్ ప్లే సెట్ లు వస్తున్నాయి. ఇంక ఉంగరాలు, బ్రేస్ లెట్లు పెట్టుకునేందుకు వచ్చే జ్యువెలరీ ఆర్గానైజర్లయితే అచ్చం అలంకరణ కోసం వాడే కళాఖండాల్లాగే రూపొందిస్తున్నారు. నగలన్నీ పొందికగా అమర్చుకోవాలంటే ఈ జ్యువెలరీ స్టాండ్ కోసం చూడొచ్చు.

Leave a comment