1912 జులై రెండున గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలోని అంకాడియాలో జన్మించిన ముక్తాబెన్ మెనెంజైటిస్ తో ఏడేళ్ళ వయసులోనే దృష్టి లోపం వచ్చింది.అయినా చదువు పట్ల ఆ పేక్షతో బిఎ పూర్తి చేసింది.ఉపాధ్యాయ శిక్షణ పొంది, బ్రేయిలీ రీడింగ్ ,బ్రేయిలీ రైటింగ్ నేర్చుకున్నారు. కవిత్వం, కథలు రాశారు. అంధుల సమస్యల కోసం కృషి చేశారు.ఆమె సేవాలను గుర్తించి సురేంద్ర నగర్ కు చెందిన వినోద్ కె.షా తన ఆస్తిని ఆమెకు విరాలంగా ఇచ్చారు. ‘ప్రజ్ఞచక్షు మహిళా సేవా కుంజ్‌’ ఏర్పాటు చేశారు ముక్తాబెన్. ఎన్నో వందల మంది అంధ విద్యార్థులు, వికలాంగ విద్యార్థులు ఈ సంస్థ ద్వారా చక్కని జీవితం పొందారు. ఆమె భర్త పంకజ్ భాయ్ దగ్లీ కూడా అంధుడే. ఎన్నో పురస్కారాలు పొందిన ముక్తాబెన్ ఈ సంవత్సరం పద్మశ్రీ పురస్కారం అందుకొన్నారు.

Leave a comment