వర్షాల సీజన్ మొదలైందా అంటే దోమలు ,ఈగలు మొదలైతాయి . ఎన్నో రుగ్మతలు చుట్టేస్తాయి వీటి కారణంగానే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే దోమల బ్రీడ్ పెరగదు ,ఇంటి చుట్టుపక్కల నీళ్ళు నిలువ చేసే డ్రమ్ములు మొదలైనవి వారానికి ఒకసారి కడిగి మళ్ళి పెట్టుకోవాలి పాచి పేరుకోకుండా చూస్తే చాలు . ఇంటి మూలలో పడేసే సీసాలు ,డబ్బాలు ,నీళ్ళు నిల్వఉండే అవకాశం ఉండే సీసా మూతలతో సహా అన్ని తీసేయాలి ముఖ్యంగా చెత్త పోగుపడకుండా చూడాలి . దోమల నివారణకు టాక్సిన్ కెమికల్స్ వాడవద్దు సహజ సిద్ధంగా లభించే మాస్క్ లో రిపెల్లెంట్ స్ప్రే లో ఎంచుకోవాలి . తెల్లవారు jaaమున సాయంత్రం వేళల్లో హానికరమైన డెంగ్యూ దోమలు చురుగ్గా ఉంటాయి నిండు రంగు దుస్తుల్ని దోమలు ఆకర్షిస్తాయి సాయంత్రాలు బయటకి వెళితే తేలిక రంగు దుస్తులు ధరించాలి .

Leave a comment