లైబి ఓయినమ్ మణిపూర్ లో తోలి మహిళా ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ పేరుతొ ఆమె పైన డాకుమెంటరీ కూడా తీశారు. లైబి కేవలం ఆటో డ్రైవర్ మాత్రమే కాదు,మనసున్న దేవతగా ఇప్పుడు మణిపూర్ ప్రజల మనసు గెల్చుకొంది. కోవిడ్ బారిన పడి కోలుకున్న ఒక అమ్మాయిని ఆమె తండ్రిని అంబులెన్స్ డ్రైవర్ ఇంఫాల్ లోని డ్యులా లాండ్  దగ్గర దింపేసి వెళ్లి పోయాడు. వాళ్ళు కంజోంగ్ జిల్లాలో స్కిప్ అనే గ్రామానికి వెళ్ళాలి. కోవిడ్ పేషెంట్ అని తెలిసి ఎవ్వళ్ళూ వాళ్ళ దగ్గరకు కూడా రాలేదు. ఆ సమయంలో లైబి ఓయినమ్కు తండ్రి కూతుళ్ళ గురించి ఫోన్ వచ్చింది. అప్పటికే చీకటి పడుతోంది. లైబి భర్త సాయం తీసుకొని,మొత్తం ఎనిమిది గంటల పాటు ప్రయాణం చేసి పేషెంట్ ను సురక్షితంగా ఇల్లు చేర్చింది. లైబి చేసిన పనికి దేశ విదేశాల్లో నే కాక సొంత ఊరు మణిపాల్ లో కూడా ప్రశంసల వర్షం కురిసింది. ఆమె కోసం లక్ష పదివేలు చందాలు పోగు చేశారు మణిపూర్ సి.ఎం ఎన్ బిరేన్ డబ్బు ఆమెకు అండ చేసి శాలువా తో సత్కరించారు.

Leave a comment