కేరళ పోలీస్ పవర్ ‘ ఉండ ‘ 2019 మలయాళం 

కేరళ లోని ఇడుక్కి నుంచి కొత్తగా నియమితులైన కేరళ పోలీసులు బస్తర్ లో ఎలక్షన్ డ్యూటీ కి బయలు దేరిన ఇతివృత్తంలో వచ్చిన సినిమా. ఉండ పోలీసుల దగ్గర లాఠీలు తప్ప బుల్లెట్లు ఉండవు. ఆ లాఠీలతో నే మావోయిస్టు ప్రాంతంలో నెగ్గుకు రావాలి. వీళ్లు మావోయిస్టు ల పేరు చెప్పి ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టాలని రాజకీయాలే కొనసాగుతున్నాయని అమాయకులను మావోయిస్టులు గా ముద్ర వేసి బలి తీసుకుంటున్నదని  స్వార్ధ రాజకీయాలకు మిలటరీ సాయం అందుతుందని సూచన ప్రాయంగా చెపుతాడు దర్శకుడు ఈ సినిమాలో. ఒక ప్రధాన అభ్యర్థి రిగ్గింగ్ చేసేందుకు వస్తే తమ లాఠీల తోనే  జవాబు చెపుతారు కేరళ పోలీసులు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో కనిపిస్తాడు .ఈ సినిమా ప్రైమ్ లో ఉంది చూడండి.