ఈ శ్రావణ మాసంలో పర్యావరణ హితంగా లక్ష్మీదేవిని అలంకరించి వ్రతం చేసుకోవచ్చు గుమ్మానికి బంతి చామంతి పూల దండలు కట్టుకోవచ్చుఅమ్మవారికి పెట్టేందుకు చెక్క స్టూలు అందంగా అమర్చి వెనక గోడకు ఇస్త్రీ చేసిన పట్టుచీరను వేలాడదీయచ్చు గులాబీ చామంతి లిల్లీ లతో అమ్మవారి చుట్టూ డిజైన్ చేసినట్లు మాలల తో అలంకరించవచ్చు. ఇత్తడి, రాగి, వెండి, బిందెలు ఏవైనా తీసుకుని ఇసుక నింపి అరటి గెలల్ని నిలబెడితే నిండుగా ఉంటుంది. అమ్మవారికి కట్టిన చీర కుచ్చులు పోసి ఇస్త్రీ చేస్తే చక్కగా నిలబడి అందంగా ఉంటుంది. కరోనా తో ప్రసాదాలు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోలేము కనుక. ఒక మంచి మొక్కను  బహుమతిగా ఇవ్వచ్చు. ఈ వర్షాలకు ఆ మొక్క నాటిన చక్కగా ఉంటుంది.

Leave a comment