కదిపితే మెరుస్తాయి 

ఏదైనా కొత్తగా ఉంటేనే  దానికి డిమాండ్.నగలైనా అంతే అవి అప్ డేట్ అయితేనే అందరినీ ఆకర్షిస్తాయి.ఇప్పుడిలా మార్కెట్ లో కొచ్చాయి టాజల్ ఉంగరాలు ఉంగరం ముందుభాగంలో గొలుసులు  వేలాడుతూ ఉండటం వీటిలో ప్రత్యేకత.మాట్లాడుతూ చేతిని కదిపినప్పుడల్లా ఉంగరం ముందున్నా టాజల్స్ కదులుతూ, అందంగా కనిపిస్తాయి. వాటిలో వజ్రాలు క్రిస్టల్స్ పొదిగిన టాజల్స్ అయితే వేలు కదిపితే మెరుపులు మెరుస్తాయన్నమాట. ఈ  టాజల్స్ ఉంగరాల యూత్ ఫేవరెట్స్.