కరోనా సమయంలో ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారి బాగోగులు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. కుటుంబ సభ్యులు తరచుగా ఇల్లు దాటి బయట తిరగటం ఆపేయాలి.ఇంట్లోకి అడుగు పెట్టే ముందుగా శానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకోవాలి.పని వాళ్లను ఇళ్లలో అడుగు పెట్టనీయకూడదు .పెద్దలు బయటికి వెళ్లే అవసరం లేకుండా అవసరమైన వస్తువులు సమకూర్చి పెట్టాలి.సామాజిక దూరం పాటించాలి మాంసకృత్తులు ఉన్న ఆహారం ఇవ్వాలి.వారు ఉండే గదిని పరిశుభ్రంగా ఉంచాలి పిల్లలను వారితో సన్నిహితంగా మెలగకుండా చూసుకోవాలి.పెద్దలకు మంచి వ్యాయామం ఉండేలా చూసుకోవాలి వారికి ఒంటరి భావన కలుగకుండా ఎక్కువ సమయం వారితో గడపాలి.

Leave a comment