కుక్ బుక్ యాప్ ని కనుక డౌన్ లోడ్ చేసుకుంటే చాలు. ఓ పెద్ద సమస్య తీరిపోతుంది. మన ఇంట్లో ఫ్రీజ్ లో ఫలానావి ఉన్నాయి ఇంకా నా ఎదురుగా కప్ బోర్డులో కొన్ని దినుసులు ఉన్నాయి అని దీనికి చెప్పుకుంటే చాలు ఈ యాప్ వెంటనె ఆహారపదార్థాలతో చేయగిలిగే వంటల లిస్టు ఇస్తుంది. ఇందులో ఉండే ఇంకా సౌకర్యం ఏమిటంటే మనం ఏ భోజనానికో వెళ్ళి ఓ వంటకం రుచి చూసి బావుందనుకొని ఫోటో తీసుకొని ఈయాప్ లో పెడితే అందులో ఉండే పదార్థాలు స్కాన్ చేసి దానీ తయారీ విధానం చెపుతుంది. అలాగే ఎంత మంది అతిథులున్నారో చెపితే కొలతలతో సహా మనకి మెసేజ్ వస్తుంది. ఎంత మంచి రోజులో పుట్టామురా దేవుడా అనుకొవాలి ఈయాప్ గురించి వింటే !

Leave a comment