మెదడు లోని ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ భాగం వ్యక్తి ఆలోచనలను ప్రతిబింబిస్తుందట ఒంటరిగా ఉంటూ ఉంటే ఆ ప్రభావం మెదడు పనితీరు పైన కనిపిస్తూ ఉంటుంది అంటారు పరిశోధకులు చుట్టూ సన్నిహితులు , స్నేహితులు ఉన్నప్పుడు వాళ్లతో స్నేహ బంధాల తో ఉన్నప్పుడు మెదడు ఎంతో పాజిటివ్ గా ఆలోచిస్తోందట. స్నేహపూర్వకమైన మాటలు, పలకరింపులు, ఆనందం, మెదడు ను చైతన్యవంతంగా ఉంచుతాయి.ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటే ఆ ప్రభావం మెదడు పైన ఎంతో ఎక్కువ.మెదడు చాలా తక్కువ స్పందన తో నిర్లిప్తంగా నిరాశకు లోనైనట్లు ఉంటుంది ఎంతకీ సంతోషానికి స్పందించదు. కరోనా సమయంలో ఈ విషయం గుర్తుంచుకోమంటున్నారు.  శారీరక ఆరోగ్య మెదడు పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న చుట్టు ప్రపంచంలో ఫోన్లో స్నేహం సంబంధాలతో ఉండాలి నిరంతరం మాట్లాడుకోవాలి ఒంటరి తనం చుట్టూ పేర్చుకోకండి  అంటున్నారు నిపుణులు.

Leave a comment