ఇంట్లోనే మ్యానిక్యూర్

శరీరంలో నిరంతరం పనిచేసేది చేతులే . రసాయనాలు, ఇతర పదార్దాలు నిరంతరం చేతులకు తగులుతూనే ఉంటాయి . వీటి పట్ల అత్యంత శ్రద్ధ చూపించాలి . నెయిల్ పెయింట్ రిమూవ్ చేసి బౌల్ లోకి గోరువెచ్చని నీళ్ళను తీసుకోని ఆ నీటిలో చేతులు మంచి మృదువుగా రుద్దితే మృతకణాలు పోతాయి . తర్వాత చేతులు పొడిగా ఉంచుకొని హొండ్ క్రీమ్ అప్లయ్ చేస్తే చేతులకు చక్కని మాయిశ్చరైజర్ లభిస్తుంది . గోళ్ళను నీతిగా కట్ చేసుకొని షేప్ చేసుకోవాలి . వేలి కుదుళ్ళను విస్మరించ కూడదు . చేతులు మృదువుగా ఉంచుకునేందుకు ఏదైనా మంచి క్రీమ్ తో మృదువుగా మసాజ్ చేయాలి . చివరిగా నెయిల్ కలర్ అప్లయ్ చేయాలి .