బెంగాలీ సినిమా లేబర్ ఆఫ్ లవ్ లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.భార్య బ్యాగ్స్ ప్యాక్ చేసే ఫ్యాక్టరీ లో పగలంతా పని చేస్తుంది.వాళ్ళిద్దరి జీవన విధానం ఈ సినిమా భార్య ఆఫీస్ కు వెళ్లే ముందే భర్త ఇంటికి వస్తాడు ఆమె చేసి ఉంచిన టిఫిన్ తిని,తెమ్మని  స్లిప్ పైన రాసిన సరుకులు తెచ్చి ,ఆ మధ్యాహ్నం అన్నం తినేసి ఇంటి తలుపులు మూసేసి వేళ కాని వేళ నిద్ర పోయే ప్రయత్నం చేస్తాడు.భార్య ట్రైన్ దిగి ఇంటికి వచ్చి భర్త తెచ్చిన సరుకులతో వంట చేసి మిగిలిన పనులు చేసి నిద్రకు  ఉపక్రమిస్తుంది ఈ ఇద్దరూ కలిసే సమయం  ఒక్కరోజు  భర్త తొందరగా ఇంటికి శరవేగంతో వచ్చిన రోజు వాళ్లు తమ మురికి ఇంట్లోంచి,ఒకే ఒక్క కిటికీ లోంచి ఒక సుందరమైన ప్రదేశాన్ని ఊహించుకోవడం ఈ సినిమా లో గొప్ప దృశ్యం ప్రపంచంలో ఆర్థికంగా అట్టడుగున ఉన్న ఎన్నో వేల లక్షల కుటుంబాలు కథ ఇది.ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఆదిత్య విక్రమ్ సేన్ గుప్తా కు చాలా అవార్డులు వచ్చాయి.ప్రైమ్ లో ఉందీ సినిమా  తప్పనిసరిగా చూడండి.

Leave a comment