జీవ దయ జైన్ ఛారిటీ (JDJC) ద్వారా పక్షుల సంరక్షణ కోసం కృషి చేస్తుంది కోకిల రమేష్ జైన్. టెర్రకోట తో తయారు చేసే పక్షుల గుళ్ళు ఉచితంగా పంపిణీ చేశారు.అలాగే పక్షుల నీళ్లు తాగేందుకు అనువైన సీసాలు కూడా సంస్థ తరఫున ఉచితంగానే ఇచ్చారు.అంతరించిపోతున్న పిచ్చుకల పరిరక్షణ ఆమె ధ్యేయం  ఇప్పటికే 500 గుళ్ళలో పిచ్చుకలు వచ్చి చేరాయి. మైసూరు లోని వివిధ ప్రాంతాల్లో పిచ్చుకల ఫీడింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నారు అలాగే పండ్ల పూల చెట్లు నాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.పక్షులు తినే ధాన్యం గింజలు బియ్యం గింజలు ఇవన్నీ కలిపి నీళ్లు తాగే బాటిల్స్ తో పక్షుల గుళ్ళు ఇస్తోంది కోకిల రమేష్ జైన్.

Leave a comment