గ్రామాలను,నగరాలను కలుపుతూ వెళ్ళే రోడ్లు ఉంటాయి కాలువలు-నదులు దాటేందుకు వంతెనలు ఉంటాయి అయితే బ్రెజిల్ లో ఒక నగరాన్ని ఇంకో నగరంతో కలిపేందుకు అడవి మార్గం పొడవునా సముద్ర తీరానికి కిలోమీటర్ల పొడువునా హైవే నిర్మించారు. బ్రెజిల్ లోని సోంపులా నగరాన్ని అట్లాంటిక్ మహా సముద్రాన్ని కలిపే ఈ అద్భుతమైన హైవే పొడవు 58.5 కిలో మీటర్లు. ఈ హైవే నగరానికి సముద్ర తీరానికి మధ్య ఉన్న అడవి పైన వుంటుంది. 6 లైన్లు,44 చిన్న వంతెనలు 7 పెద్ద వంతెనలతో పాటు 11 టన్నెల్స్ తో నిర్మించారు ఈ హైవే వేసి. అడవి గుండా ఈ హైవే పైన ప్రయాణం ఎంతో ఉత్సాహ భరితంగా ఉంటుంది.

Leave a comment