ఉద్యోగ జీవితం ఎప్పుడూ సవాళ్ల మయమే. ఎంతోమంది సహోద్యోగులతో కలిసి పనిచేయాలి. ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అవి మన కెరీర్ పైన కూడా ప్రభావం చూపెడతాయి. కానీ కొంత జాగ్రత్తతో తెలివిగా మెలిగితే ఉద్యోగ సోపానాలు తేలికగా ఎక్కేయచ్చు. ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలిసి వచ్చినప్పుడు కొత్త పని చేయవలిసివచ్చినప్పుడు ఎప్పుడు సహోద్యోగ సలహాలు తీసుకోకూడదు. మన ఉద్యోగం పట్ల మన బాధ్యత పట్ల మనకే ఒక స్పష్టత ఉండాలి. ఉద్యోగంలో చేరగానే అక్కడ నియమ నిబంధనలు తెలియకపోవచ్చు. సంస్థ పెద్దవో చిన్నదో దానికి పరిధులు నియమాలు ఉంటాయి వాటిని తెలుసుకుని అర్ధం చేసుకుని ఉద్యోగంలో ఇమిడిపోయే ప్రయత్నం చేయాలి. అన్నింటికంటే ముఖ్య విషయం ధైర్యం. చాలా మంది అమ్మాయిలు స్కూల్ లాగా ఆఫీసుల్లో కూడా వెనక ఉండేందుకు సీనియర్లు ఉన్నతాధికారుల ముందు నోరు విప్పకుండా ఉండేందుకే ప్రయత్నిస్తారు. కానీ ఉద్యోగ జీవితం ఒక భవిష్యత్తు. తెలివి తేటలు నిరూపించుకుని ముందుకువెళ్ళే రాజమార్గం. ఎప్పుడూ ముందే ఉండాలి. మిమల్ని మీరే ఆవిష్కారించుకోవాలి. అప్పుడే అద్భుతమైన కెరీర్ దక్కుతుంది.
Categories
You&Me

ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ లోనే ఉండాలి

Leave a comment