శక్తినిచ్చే సొరకాయ 

ఈ వేసవిలో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది నీటి నిల్వలు తగ్గి నిస్సత్తువ ఆవరిస్తుంది.ఈ పరిస్థితి రాకూడదు అనుకుంటే సొరకాయ ఆహారంలో తరచూ తీసుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణులు చెపుతున్నారు వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్ సి,రైబోఫ్లేవిన్, జింక్, థయామిన్, ఇనుము,మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇనుము తో పాటు సొరకాయ లో  ఉండే విటమిన్ బి,సి లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.ఇందులోని పొటాషియం ఒత్తిడి పెరగ నివ్వదు జీర్ణశక్తికి సహకరించే  పీచు పుష్కలంగా ఉంటుంది. కెలోరీలు చాలా తక్కువ వంద గ్రాములు ముక్కల్లో శరీరానికి 15 క్యాలరీలు అందుతాయి.