ఏక్ హజారాచి నోట్

చదువు సంధ్య లేని పేదవాళ్ళ విషయంలో ఎన్నో అన్యాయాలు జరుగుతోనే ఉంటాయి. అరే ఇది కూడానా అనిపించే సంఘటనలు చాలా ఉంటాయి. అలాంటి సంఘటనే మరాఠీ సినిమా ఏక్ హజారాచి నోట్.  శ్రీహరి సాథే తీసిన ఈ సినిమా ఎన్నో అవార్డులు గెలుచుకోంది. బుధ విదర్భలో నివశించే జముసలామె . అప్పుల బాధతో భర్త కొడుకు ఆత్మహత్య చేసుకొంటారు. కోడలు పుట్టింటికి వెళ్ళిపోతుంది. కటిక పేదరికంలో బతికే బుధ కి  పక్కింటి సుదామా తోడుగా ఉంటాడు. ఓ రోజు సుదామతో పాటు భోజనం పొట్లం కోసం ఎలక్షన్ మీటింగ్ కు వెళ్తుంది బుది . ఆత్మహత్య చేసుకొన్న కుర్రవాడి తల్లి బుది అని ఆ అభ్యర్థి తెలుసుకొని అందరికి వంద రూపాయలు ఇస్తూ బుది కోసం వెయ్యి రూపాయల నోటు ఇస్తాడు. అలా చేతిలో పడిన నోటు ఆ పేదరాలిని,పరుగు అబ్బాయి సుదామా ను ఎలా కష్టాల పాలు చేసిందో చూడాలంటే సినిమా వెంటనే చుడండి.