తలుపులు మూసి కిటికీలు వేసి దోమ తెరలు కట్టి మస్కిటో కాయిల్స్ ఆయిల్స్ మ్యాట్స్ పెట్టినా ఎలా ఎగురుకుంటూ వచ్చి కుట్టేస్తాయో దోమలు. పైగా ఈ కాయిల్స్ ఎన్నో అనారోగ్యాలు ఇప్పుడు ముంబాయి  కు చెందిన నిద్రా టెక్స్టైల్స్ అనే సంస్థకు  చెందిన  ఇద్దరు అక్కా చెల్లెళ్లు . కస్తూరి శ్రేయా పోడార్ మస్ క్విట్ ఇన్ అనే దుప్పటి తయారు చేసారు. నూటికి నూరు శాతం నూలుతో తయారు చేసిన ఈ  బ్లాంకెట్ తో  పెర్ మెత్రిన్  అనే రసాయనాన్ని జొప్పించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన ఈ రసాయనాన్ని అమెరికా సైనిక దళ యునిఫారాల్లో వాడుతున్నారు. టెక్సటైల్ డిజైనర్ కస్తూరి ఆలోచనల్లోంచి రూపం పోసుకున్న ఈ దుప్పటి కోసం వాడే కెమికల్స్ స్విజ్జర్ల్యాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. దీన్నించి ఎలాంటి దుష్ఫలితాలు రావని చిన్న పిల్లలు గర్భిణులు కూడా నిర్ణయంగా వాడుకోవచ్చంటున్నారు. ఉత్పత్తిదారులు. 50 ఉతుకుల వరకు దోమల్ని దగ్గరకు రానీయకుండా కాపాడుతుంది. తర్వాత దాన్ని మాములు దుప్పటిలా వాడుకోవచ్చు.

Leave a comment