ఆర్డర్ పై డీజిల్

రెపోస్ ఎనర్జీ వ్యవస్థాపకులు అదితి భోసలే వలుంజ్ ఆమె భర్త చేతన్ వలుంజ్,మొబైల్ పెట్రోలు పంపులు తయారీ ఏర్పాటు ప్రారంభించారు.ఈ స్టార్టప్ కు రతన్ టాటా మార్గదర్శ గా ఉన్నారు. ఇందులో పెట్టుబడి కూడా పెట్టారు దేశప్రగతికి ఉపయోగపడే అంకుర్ సంస్థ కోసం ఈ ఇద్దరు ఎన్నో ప్రాజెక్టుల గురించి ఆలోచించారు.మొబైల్ పెట్రోల్ పంపుల తో కోరిన చోటికి అడిగిన సమయానికి డీజిల్ ను పంపే సంస్థ  స్థాపించారు.రతన్ టాటా సలహా మేరకు,ఇంధన పంపిణీలో నాణ్యత పెట్రోల్ పంపుల తయారీని ఔట్ సోర్సింగ్ కు ఇవ్వకుండా సొంతంగా తయారు చేయటం మొదలుపెట్టారు వారి మొబైల్ పెట్రోల్ పంపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కల్తీ ని వృధాని నిరోధిస్తుంది.ధర 25 లక్షల పెట్రోలు పంపులు యజమానులు వీటిని కొనుక్కోవచ్చు.