చక్కర గురించి శాస్త్రవేత్తలు కొత్తగా చేసిన అద్యాయన ఫలితాల్లో సంతోషించే విషయం ఒక్కటుంది. చక్కర తినడం వల్ల పళ్ళు పాడవవు, బరువు పెరగరు, కానీ మానసిక సమస్యలు చుట్టూ ముడతాయని ఒక రిపోర్ట్. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ అద్యయన కారులు చేసిన స్టడీ లో ఎనిమిది వేల మందిని సంవత్సరం పాటు పరిశీలించాక కొన్ని ప్రశ్నపత్రాలతో స్టడీ నిర్వహించారు. పంచదార తీసుకోవడానికి, యంగ్సైయిటీ కి ఉన్న సంబధం గురించి అద్యయనం సాగింది. తక్కువ తీపి తింటే శరీరం ఆరోగ్యం ఉండటం, డిప్రెషన్ వంటి సమస్యలు ఏవీ రాకపోవటం తెలిసింది. అలాగే తీపి తినే వాళ్ళు,సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకునే వాళ్ళు లో యంగ్సైయిటీ, డిప్రెషన్ వంటివి గుర్తించారు. ఇంకా పరిశోధన జరగవలసి ఉందని, అయినా చక్కెరలో ఇంకొన్ని సమస్యలు అవకాశం ఉన్నందున తీపి తక్కువే తీసుకోవాలని వారు చెప్తున్నారు.

Leave a comment