ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో గడిపి వచ్చిన పిల్లలను వచ్చి రాగానే చదవమంటారు. హోం వర్కులు ఎలానూ తప్పవు ఇంట్లో కొద్ది సేపు చదివితే ఎకడమిక్ స్థాయి పెరుగుతుంది. కానీ స్కూలు నుంచి వచ్చి రాగానే కాదు. ఆరోగ్యవంతమైన స్నాక్ తినాలి. కనీసం గంట సేపు ఆడుకోవడం, ఇంట్లో వాళ్ళతో కబుర్లు పూర్తయ్యాక స్నానం చేసి చదువుకు కుర్చోవచ్చు. ఏ టైం ఎంచుకోవలన్నది పిల్లల తరగతి వాడి షెడ్యూల్ ను బట్టి, ఎంత సేపన్నది వాడి వయస్సు చదువును బట్టి ఉంటుంది. ఆరేళ్ళ పిల్లలకు ఓ అరగంట చదువు చాలు. ఏడేల్లోస్తే ఒక గంట, ఇక తరగతి వయసు పెరిగే కొద్ది ఎంత సేపన్నది ఆధారపడి ఉంటుంది. అయితే ప్రతి రోజు ఒక నిర్ణిత సమయంలో చదువు మొదలు పెట్టాలి. ఆ సమయానికి మిగతా పనులన్నీ పూర్తి చేసుకోవడం అలవాటు అవుతుంది. మరీ ఎక్కువ హోం వర్క్ వుంటే క్లాస్ టీచర్ తో మాట్లాడొచ్చు. కానీ హోం వర్క్ శ్రద్ధగా చేసే వాతావరణం మనం కల్పించాలి. హాల్లో టీ.వి. మోగుతూ ఎవరో ఎంజాయ్ చేస్తూ వుంటే పిల్లల్ని చదువుకోమంటూ వెంటాడటం మాత్రం సరైన పద్ధతి కాదు.

Leave a comment