ఇప్పటికే ఎన్నో రకాలు వరి వంగడాలు సృష్టించారు శాస్త్రవేత్తలు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేవి, ఎక్కువ ఫలసాయం ఇచ్చేవి.కొద్ది నెలల్లో పంట ఇచ్చేసే ఎన్నో రకాల వరి వంగడాలు ఉన్నాయి ఇప్పుడు హృద్రోగాలకు దారి తీసే బి పీ ని తగ్గించే వరి సృష్టించారు శాస్త్రవేత్తలు.సాధారణంగా బి పీ తగ్గించేందుకు అందుకు కారణం అయ్యే యాంజియో కాన్ వర్తింగ్ ఎంజైమ్ శాతాన్ని తగ్గించే మందులు ఇస్తుంటారు పరిశోధకులు. ఈ ఎంజైమ్ నిరోధించే సహజ పదార్థాల పైన దృష్టి సాధించారు.ఎంజైమ్ ని నిరోధించే అమైనో ఆమ్లాలతో కూడిన జన్యువును రూపొందించింది దాన్ని వరి మొక్కల్లో ప్రవేశ పెట్టారు.ఇలా పండించిన బియ్యం బి పీ ని తగ్గిస్తాయని ప్రయోగపూర్వకంగా నిరూపించారు కూడా.

Leave a comment