బిస్కెట్లు,కేకులు ఎంతో రుచిగా ,నాణ్యంగా కనిపించే ప్రమోషనల్ యాడ్స్ తో కనువిందు చేస్తూ ఉంటాయి. అయితే వీటికి మంచి ఫ్లేవర్ రావటానికి ఉపయోగించే ట్రాన్స్ ఫ్యాట్ అనే కొవ్వు పదర్థాలు ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపెడుతాయని పరిశోధకులు చెపుతున్నారు. కొన్ని వందల మందిపై జరిపిన ఈ పరిశోధనలో ఆహారంలో భాగంగా బిస్కెట్లు తినే వారిలో మందు ఊబకాయం వారిలో జ్ఞాపక శక్తి సమస్యలు గుర్తిచారు. ట్రాన్స్ ఫ్యాట్ కారణంగానే గుండె సంబంధిత సమస్యలు రావచ్చునని పరిశోధకులు తేల్చారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండమని వారిని అదేపనిగా బిస్కెట్లు తినే అలవాటు తగ్గించమని చెపుతున్నారు.

Leave a comment