పురాణాల్లో మార్కండేయ మహర్షి కలువపువ్వుల నారతో దేవతలకు వస్త్రాలు నేసి ఇచ్చారని చెపుతారు. అవి చుస్తే రావివర్మ చిత్రాల్లో లక్ష్మీదేవి కట్టుకొన్న కంచి కామాక్షి అమ్మంత దైవత్వం కనిపిస్తుందీ కంచి చీరల్లో. ఈ కంచి చీరలు కాస్త బరువు. పల్లు, అంచులు రెండు చీర ప్రధాన భాగం కన్నా భిన్నమైన రంగుల్లో ఉంటాయి. విడిగా నేసిన పల్లు, అంచుని చీర ప్రధాన భాగంలోకి నేర్పుగా ముడి వేసే అల్లిక కంచి పట్టు చీరల ప్రత్యేకత చీర పాత బడి పోయిన కళకళలాడే అంచును, చీర కొంగును విదదీయడం సాధ్యం కాదు. చీర తో జరి కలిపేస్తారు. జరీ అతి సన్నని వెండితీగ, బంగారు ద్రవంలో ముంచిన జరీ తీగలు వాడి బంగారు జరీ చీరలు నేస్తున్నారు కళాకారులుఇద్దరు చేనేత కళాకారులు కలిసి నెల రోజులు కష్టపడితే ఒక  చీర తయ్యారవ్వుతుంది. మామిడి పిందెలు, నెమళ్ళు, చిలుకలు వంటి ప్రకృతి అంశాలతో పాటు పలు రూపాలను చీర పైన చెక్కగా అల్లుతారు. ఈ చీరల డిమాండ్ ఎన్నేళ్ళ నుంచి వస్తున్నా ఇప్పటికీ తగ్గలేదు.

Leave a comment