నిహారికా, ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారంటే మనం రోజును ఎలా ప్రారంభిస్తామో దాని ప్రభావం మిగతా దినచర్య పైన తప్పనిసరిగా ఉంటుంది. అలారం పెట్టుకుని అది మోగగానే లేస్తామా ? దానిని కాసేపు ఆపుతూ బద్దకంగా మరో పది నిమిషాలు పోడిగిస్తాం. నిద్ర లేవటం అలా బద్దకంగా మొదలు పెడితే అది రోజంతా ప్రతి పనిని కాసేపు ఆపుతూ పోతుంది.   అందుకే సాధ్యమైనంత తోందరగా పడుకుని ఉదయం లేవగానే మనసులో హుషారు పువ్వు విచ్చుకున్నట్లు విచ్చుకోవాలి. రోజంతా ఎలా గడుపుతామో దానికి తగినట్లు టైమ్ సైట్ చేసుకుంటూ పోవాలి.  సాయంత్రమ ఆరు గంటలకు సినిమా హాల్లో ఉండాలనుకుంటే ఉదయం నుంచి ప్రత పని పర్ ఫెక్ట్ గా నిమిషం తేడా లేకుండా పరిగెత్తూతు పూర్తి చేయాలి. ఆ సమయంలో అలసట, నీరసం, విసుగు అస్సలు ఉండకూడదు. సమయాన్ని వాడుకోవడం మనకు తెలియాలి అంతే!

Leave a comment