అర్చనా సారంగ్ పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కారిణి.భారతీయ సంస్కృతి ఆదిమ తెగల కట్టుబాటు ఆచార వ్యవహారాలు కాపాడేందుకు కృషి చేస్తున్న యువతి ముంబాయి లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో రెగ్యులేటర్ గవర్నెన్స్ కోర్స్ చేశారు. విద్యార్థి నాయకురాలుగా పనిచేశారు.తాజాగా ఈమెకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కు పర్యావరణ కాలుష్య నియంత్రణ చర్యలు. కరోనా నుంచి కోలుకునేందుకు అవలంబించవలసిన విధి విధానాల పైన సలహాలు ఇచ్చేందుకు ఎంపికైన ఏడుగురు యువ ప్రతినిధుల బృందంలో ఒకరుగా ఎంపికయ్యారు.మన దేశం నుంచి ఘనత సాధించిన ఏకైక యువతి అర్చనా సారంగ్.పర్యావరణ ఉద్యమకారిణి గా భారతీయ మూలాలు ఆదిమ జాతి సంస్కృతి పరిరక్షణ కోసం ఆమె చేస్తున్న కృషి కూడా ఆమెకు ఈ గౌరవం రావడానికి ముఖ్య కారణం.

Leave a comment