నగలు కొనడం పై ఎంతో శ్రద్ద చూపిస్తారు,అందమైన డిజైన్లు ఎంచుకోవడంలో ఎంతో క్రియేటివిటి ప్రదర్శిస్తారు. అవి ఎఫ్పుడు మెరిసిపోతూ కొత్తవిగా కనిపించాలంటే కూడా అంతే శ్రద్ద చూపించాలి. వీటిని ధరించినప్పుడు బాడీ ఆయిల్ కాస్మోటిక్ క్రీములు పేరుకుంటాయి. పలచని వస్త్రంతో వాటిని శుభ్రంగా తుడిచెయ్యాలి. ఒక వేళ స్వేదం పేరుకుందని అనిపిస్తే మైల్డ్ సోప్ వాటర్ లో కడిగి వెంటనే తుడిచెయ్యాలి. నగలు ఎఫ్పుడు వాడకం ఓపెన్ గా ఉంచకూడదు. సూర్య కిరణాలు ,గాలి తగలకుండా షాపుల్లో షోకేసుల్లో పెట్టినట్లు వాటికి ఉద్దేశించిన బాక్సుల్లో భద్రపరచాలి. ముత్యాలు,జెమ్స్ ఉన్న ఆభరణాలు ప్రత్యేకంగా ఒకదానికి ఒకటి తగలకుండా ప్రత్యేకమైన జ్యూవెలరీ బాక్సుల్లో భద్రపరచాలి.

Leave a comment