అనుష్క ఆరోగ్య రహస్యం 

శరీరం తీరైన ఆకృతి లో ఉండాలంటే వర్క్ వుట్స్  ఎంత అవసరమో ఆహారం కూడా అంతే అవసరం అంటోంది బాలీవుడ్ నటి అనుష్క శర్మ .తన 31 వ పుట్టినరోజు సందర్భంగా లైవ్ చాట్ లో అభిమానులతో మాట్లాడుతూ,ఈ కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారంలో భాగంగా ఇమ్యూనిటీ బూస్టింగ్ టీ  గురించి వివరంగా చెప్పారు. ఆమె చెప్పిన పసుపు మిరియాల తో కూడిన ఈ టీ ని ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు .మిరియాలు , పసుపు,అల్లం, బెల్లం లేదా తేనె.. నల్ల మిరియాల పొడి చేసి పెట్టుకోవాలి.చిన్న అల్లం ముక్క పేస్టులా చేసి దీన్ని వేడి నీటిలో వేసి అందులో మిరియాల పొడి అల్లం పేస్ట్ కలపాలి బాగా మరిగాక ఇందులో రుచి కోసం బెల్లం కానీ తేనె కానీ వేసుకోవచ్చు .ఈ టీ చాలా రుచిగా ఆరోగ్యవంతంగా ఉంటుందని చెబుతోంది అనుష్క శర్మ.