ఒక్క సారి డల్ గా నిరుత్సాహంగా వుంటుంది. అప్పుడు మంచి మూడ్ లోకి రావాలంటే కాఫీ తగలేదనో, వేడిగా టీ తగలేదనో బావుంటుందనుకుంటాం. కానీ మూడ్ ఇచ్చే ఫుడ్ తినమంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గల చేపలు, మెగ్నీషియం, విటమిన్-బి3 ఈ సందర్భంలో మంచి ముడ్ లిఫ్టర్ గా పనిచేస్తాయి. సోయాపాలు, సోయాబీన్ కుకీస్ తిన్నా మంచి ఫలితం వుంటుంది. వీటిలో వుండే కాల్షియం విటమిన్ బిలు శక్తి స్థాయిలకు మంచి మూడ్ కు ముఖ్యావసరాలు. పూర్తి ధాన్యాలు, ముదురాకు పచ్చ కూరగాయలు సెరటోనిన్ అందిస్తాయి. యాంగ్జయిటీ స్ట్రెస్ స్థాయిల్ని తగ్గిస్తాయి. ఆహారం మెదడు లోని కెమికల్, బయో కెమికల్ మార్పులను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ప్రవర్తన మనం తినేటు వంటి ఆహారం పై చాలా భాగం ఆధార పడి వుంటుంది.

 

 

 

Leave a comment