చుట్టు స్నేహితుల వల్ల కూడా మూడ్ స్వింగ్స్ మారుతుంటాయని , గుడ్ మూడ్ , బ్యాడ్ మూడు ప్రభావం తప్పని సరిగా ఇతరులను ప్రభావితం చేస్తుందని చెపుతున్నాయి అధ్యయనాలు. ఫ్రెండ్ షిప్ నెట్వర్క్ లో మూడ్ ఒక్క నిమిషంలో విస్తరిస్తుందని విశ్లేషకులు చెపుతున్నారు. నిస్సహాయ భావాలు ,నిర్లిప్తత ,ఆసక్తి లేమి వంటి ఫీలింగ్ ఒక్క క్షణంలో పాకి పోతాయి.ఇలా అత్యధికమైన మూడు స్వింగ్స్ ఉన్నా స్నేహితులు ఉంటే ఆ డిప్రేషన్ తాలూకు ప్రభావం ,లక్షణాలు ఎదుటి వాళ్ళపై పడతాయి. ఆకలి ,నిద్ర,అలసటకు సంబంధించిన ప్రభావాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెపుతున్నారు. ఎప్పుడైన కారణం లేకుండా మూడ్స్ త్వరగా మారిపోతున్న లేదా డిప్రేషన్ ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే స్నేహితుల పోస్టులు ,వాట్సాప్ మెసేజ్ లు ఒక్క సారి చూసుకోమంటున్నాయి అధ్యయనాలు.

Leave a comment